Namaste NRI

ఆంధ్రా కింగ్ తాలూకా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

రామ్‌ నటిస్తున్న తాజా చిత్రం ఆంధ్రాకింగ్‌ తాలూకా. ఓ సినీ హీరో అభిమాని కథగా తెరకెక్కిస్తున్నారు. మహేష్‌బాబు.పి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుగుతున్నది. తాజాగా ఈ సినిమా నుంచి నువ్వుంటే చాలే  అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటను హీరో రామ్‌ రచించడం, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌ ఆలపించడం హైలైట్‌గా నిలిచింది. ఒక చూపుతో నాలోనే పుట్టిందే, ఏదో వింతలా గుండెలో చేరిందే, నువ్వెవరో నాలోన అని అడిగానే..తానేగా ప్రేమని తెలిపిందే, నువ్వుంటే చాలే  అంటూ పొయెటిక్‌గా సాగిందీ గీతం.

హీరో ప్రేమప్రయాణానికి ఈ పాట అద్దం పడుతుందని, విజువల్స్‌ కూడా కట్టిపడేస్తాయని మేకర్స్‌ తెలిపారు. భాగ్యశ్రీబోర్సే, ఉపేంద్ర, రావు రమేష్‌, మురళీశర్మ తదితరులు నటిస్తున్నారు.  ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ మని, సంగీతం: వివేక్‌, మెర్విన్‌, నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహేష్‌బాబు.పి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events