అమెరికాను కాండిడా ఆరిస్ అనే ఓ ఫంగస్ వణికిస్తున్నది. ఆ దేశంలో 2016లో మొదటిసారి గుర్తించిన ఈ ఫంగస్, ఇప్పటికే అక్కడి 25 రాష్ర్టాల్లో వ్యాపించింది. 2019 నుంచి 2021 మధ్య ఫంగస్ సోకిన వారి సంఖ్య మూడు రెట్లు పెరిగిందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆండ్ ప్రివెన్షన్(సీడీసీ) తాజా నివేదిక పేర్కొన్నది. 2016లో అమెరికాలో 53 మందికి సోకిన ఈ ఫంగస్, క్రమంగా పెరుగుతూ 2022లో 2,377 మందికి సోకింది. ఈ ఫంగస్ ద్వారా కలిగి జబ్బును నయం చేయడానికి చికిత్స లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.