ఆలియా భట్, సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా గంగూబాయి కతియావాడి. మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఓ బలమైన, సంక్లిష్టమైన గంగూబాయ్ పాత్రలో ఆలియా అద్భుతంగా నటించదని స్పష్టమవుతుంది. ఈ సందర్భంగా విడుదలకు ముందే అంచనాలు పెంచేస్తూ ట్రైలర్‌ను విడుదల చేశారు. కామాఠిపురలో ప్రతిరాత్రి ఓ పండగే. ఎందుకంటే అక్కడ గంగూబాయ్ ఉంటుంది అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇందులో గంగూబాయ్‌గా ఆలియా భట్ నట విశ్వరూపం చూపించిందని ట్రైలర్‌ని బట్టి అర్థమవుతుంది. బొంబాయిలోని కామాటిపుర అనే ఒక రెడ్ లైట్ ఏరియాలో నివసించే సాధారణ అమ్మాయి ఒక బలమైన రాజకీయ నాయకురాలిగా ఎలా ఎదిగిందన్నదే ఈ కథ. అజయ్ దేవగణ్, హుమా ఖురేషి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పెన్ స్టూడియోస్ పతాకంపై సంజయ్‌లీలా భన్సాలీ, జయంతిలాల్ గడ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.