నాగార్జున నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ది ఘోస్ట్ చిత్రీకరణ దుబాయ్‌లో జరిగింది. సోనాల్ చౌహాన్ నాయికగా నటిస్తోంది. తాజాగా దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేశారు. అక్కడ స్టంట్ సన్నివేశాలు, రొమాంటిక్ పాట చిత్రీకరణ జరిపినట్టు చిత్ర బృందం తెలిపింది. ది ఘోస్ట్ సినిమా యాక్షన్ చిత్రాలు, విజువల్ పీస్ట్ ఆస్వాదించేవారికి కొత్త అనుభూతిని కలిగిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా ఎడారిలో తీసిన యాక్షన్ సీన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అన్నారు. నాగార్జున, సోనాల్ చౌహాన్‌తో పాటు గుల్ సవాన్, అనిఖా సురేంద్రన్ నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ కె.నారంగ్. పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : ముకేష్, కళ: బ్రహ్మ కడలి, పోరాటాలు: దినేష్ సుబ్బరాయన్, కేచ.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)