అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న సినిమా ది ఘోస్ట్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. సోనాల్ చౌహాన్ నాయికగా నటిస్తున్నది. ది ఘోస్ట్ ఫస్ట్ సింగిల్ వేగం సెప్టెంబర్ 16న లాంఛ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. నాగార్జున, సోనాల్ పై వచ్చే రొమాంటిక్ సాంగ్ రాబోతోందని పోస్టర్ ద్వారా తెలియజేశారు మేకర్స్. భరత్`సౌరభ్ ఈ పాటను కంపోజ్ చేశారు. ఈ పాటను కపిల్ కపిలాన్`రమ్య బెహరా పాడగా.. కృష్ణమదినేని రాశారు. హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్ర కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంటర్ పోల్ ఆఫీసర్ విక్రమ్ పాత్రలో నాగార్జున కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి మార్క్ కే రాబిన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నారాయణదాస్ కె నారంగ్, పూస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా దసరా పండక్కి అక్టోబర్ 5న రాబోతున్నది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)