అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా న్యూజెర్సీ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడిరచారు. అమెరికాలో రోజుకు 10 లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. న్యూజెర్సీలో ప్రతి రోజు 35 వేల మంది కొవిడ్ బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ ఫిల్ మర్పీ కీలక ప్రకటన చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ వేవ్‌ను అధిగమించడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకోనున్నట్టు ఈ సందర్భంగా ఆయన వెల్లడిరచారు. ఇప్పటి వరకు 10 వేల మంది ప్రజలు ఆసుపత్రి పాలైనట్టు పేర్కొన్నారు.