నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్‌టైన్‌మెంట్ తెరకెక్కించిన చిత్రం వరుడు కావలెను. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలోఈ చిత్రం ట్రైలర్‌ను రానా దగ్గుబాటి విడుదల చేశారు. అనంతరం రానా మాట్లాడుతూ నాగశౌర్యని చూస్తే రాముడు మంచి బాలుడు అన్న సామెత గుర్తొస్తుంది. ట్రైలర్ బావుంది. ఈ సినిమాతో నాగశౌర్య ఈజ్ బ్యాక్ అని చెప్పగలను అని అన్నారు. నాగశౌర్య మాట్లాడుతూ ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. తెరపై ఆర్టిస్ట్‌లంతా ఫ్రెష్‌గా కనిపించడానికి కారణం డైలాగ్‌లు. గణేష్ రావూరి చక్కని సంభాషణలు రాశారు. విశాల్ చంద్రశేఖర్ చక్కని బాణీలు ఇచ్చారు. సౌజ్య అక్క నన్ను, సినిమాను ఎంతో ప్రేమించి ఈ సినిమా చేసింది. రీతు చాలా అద్బుతంగా నటించింది అని తెలిపారు.
నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ఇది ఫ్యామిలీ, కమర్షియల్ సినిమా. సెకెండాఫ్‌లో ఒక సస్పెన్స్ ఉంది. అది యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది అని అన్నారు. మాటల రచయిత గణేష్ రావూరి మాట్లాడుతూ భూమిలాంటి అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఆకాష్‌లాంటి అబ్బాయి కావాలి. ఈ చిత్రంలో మా హీరోహీరోయిన్లు పాత్రలు అంత ప్లజెంట్‌గా ఉంటాయి. ఫన్, ఎమోషన్స్ అద్భుతమైన సంగీతం ఉన్న చిత్రమిది అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకురాలు లక్ష్మీ సౌజన్య, సప్తగిరి, గణేష్ రావూరి, రాంబాబు గోశాల, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్, ఈ చిత్రానికి సమర్పణ : పి.డి.వి. ప్రసాద్. నిర్మాత: సూర్య దేవర నాగవంశీ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : లక్ష్మీ సౌజన్య. ఈ నెల 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.