తానా బోర్డు డైరెక్టర్ డా. కొడాలి శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వాలర్ కౌంటీలో (టెక్సాస్) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో డా.శ్రీనివాస్ సతీమణి వాణి, వారి ఇద్దరు కుమార్తెలు అసువులుబాశారు. తమ పెద్ద కూతురిని వాణి కాలేజీ నుంచి కారులో ఇంటికి తీసుకొస్తుండగా పక్క నుంచి వచ్చిన మరో వాహనం వారిని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై తానా సభ్యులు, శ్రీనివాస్ మిత్రులు, సన్నిహితులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.