
కొవిడ్ తర్వాత మరో మహమ్మారి మానవాళిపై దాడి చేస్తుందా? అంటే అవుననే అంటున్నారు యూకే మాజీ ప్రధాన శాస్త్రీయ సలహాదారు పాట్రిక్ వాల్లన్స్. త్వరలోనే జరగనున్న బ్రిటన్ ఎన్నికలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ మరో మహమ్మారి రాక తప్పదని, కాబట్టి వచ్చే ప్రభుత్వం ఇందుకు సంసిద్ధంగా ఉండేందుకు ప్రాధా న్యం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ఇందుకు గానూ పరీక్షా కేంద్రాలు, వ్యాక్సిన్లు, చికిత్స సదుపాయా లు అందుబాటులో ఉంటే కొవిడ్-19 వల్ల కలిగిన దారుణ పరిస్థితులు మళ్లీ ఉత్పన్నం కాకుండా చూడొచ్చని ఆయన తెలిపారు. ఇందుకు ప్రపంచ సహకారం కూడా అవసరమని అన్నారు. దేశాన్ని రక్షించుకునేందుకు సైన్యం ఎలా ముఖ్యమైనదో, మహమ్మారులను ఎదుర్కొనేందుకు కూడా సంసిద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.















