అమెరికాలో వాషింగ్టన్‌లో స్పెల్లింగ్ బీ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో భారతీయ అమెరికా సంతతికి చెందిన హరిణి లోగన్ ఈ ఏడాది స్కిప్స్ర్ జాతీయ స్పెల్లింగ్ బీ పోటీల్లో చాంపియన్‌గా నిలిచింది. 22 అక్షరాల ఉన్న పదాన్ని ఫైనల్లో చెప్పిన హరిణి 2022 విజేతగా నిలిచింది. 14 ఏళ్ల హరిణి శాన్ ఆంటోనియాలో 8వ గ్రేడ్ చదువుతోంది.స్పెల్ `ఆఫ్ ఫైనల్లో ఆమె డెన్వర్‌కు చెందిన 12 ఏళ్ల విక్రమ్ రాజును ఓడిరచింది. కేవలం 90 సెకన్లలో స్పీడ్‌తో స్పెలింగ్ బీ కాంపిటీషన్‌ను హరిణి ఎగురువేసుకుపోయింది. ఆ సమయంలో ఆమె 21 పదాలను తత్పులేకుండా చెప్పింది. అదే సమయంలో విక్రమ్ 15 పదాలను తప్పలేకుండా తెలిపాడు. స్పెల్లింగ్ బీ కాంపిటీషన్‌లో పాల్గొనడం ఇది నాలుగవ సారి అని, ట్రోఫీని గెలవడం సంతోషంగా ఉందని హరిని పేర్కొన్నది. నిజానికి మొదట్లో కొంత ఆందోళన ఉందని, కానీ ఆ తర్వాత తన వేగాన్ని పెంచినట్లు ఆమె తెలిపింది. ఎక్కువగా శ్వాస తీసుకోకుండా చాలా వేగంగా హరిణి పదాలను చదువుతూ తన ట్యాలెంట్‌ను చూపించింది.
