Skip to main content

Namaste NRI

శంకర్‌కు బహుమతిచ్చిన భారతీయుడు… ఏంటో తెలుసా?

భారతీయుడు సినిమా విజయంతో చిత్రపరిశ్రమలో హిట్‌ కాంబోగా నిలిచారు ప్రముఖ కథానాయకుడు కమల్‌ హాసన్‌, దర్శకుడు శంకర్‌. ఇప్పుడు వీరిద్దరి కలయికలో వస్తోన్న చిత్రం భారతీయుడు 2. సీక్వెల్‌ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ  చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉద‌య‌నిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు.   ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య విలన్‌గా నటిస్తుండగా, బాబీ సింహా, సిద్దార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, స‌ముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

తాజాగా ఈ సినిమా దర్శకుడికి ఖరీదైన వాచ్‌ను బహుమతిగా ఇచ్చారు కమల్‌. ఈ వాచ్‌ మార్కెట్ ధర రూ.8.77 లక్షలు .   ఈ రోజు ఈ చిత్రంలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చూశాను. శంకర్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ సినిమా నీ జీవితంలో ఒక ఉన్నత శిఖరంలా నిలిచిపోతుంది. ఇది మాత్రమే శిఖరంలా ఉండకూడదనేది నా కోరిక. దీన్ని పైకి తీసుకెళ్లి గర్వపడకండి మీరు ఇంకా పైకి ఎదగాలి అని వ్యాఖ్యల్ని జోడిరచారు కమల్‌. ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను చెన్నై , లాస్‌ ఏంజెల్స్‌, తైవాన్‌, సౌతాఫ్రికా ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఆయా లొకేషన్లలో సాంగ్స్‌తోపాటు ఇంటెన్స్ యాక్షన్‌ సీక్వెన్స్ ను షూట్ చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాతికి విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events