Namaste NRI

నాగార్జున వాయిస్ ఓవ‌ర్‌తో ఇట్లు అర్జున గ్లింప్స్ రిలీజ్

వాట్‌ నెక్స్ట్‌ ఎంటర్టైన్మెంట్స్‌ తన తొలి ప్రొడక్షన్‌ను ఇట్లు అర్జున తో ప్రారంభించింది. సక్సెస్‌ ఫుల్‌ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన వెంకీ కుడుముల కంటెంట్‌ బేస్డ్‌ కథలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో నిర్మాతగా కొత్త జర్నీని ప్రారంభించారు. నూతన దర్శకుడు మహేష్‌ ఉప్పల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనిష్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. అనస్వర రాజన్‌ హీరోయిన్‌. తాజాగా విడుదలైన సోల్‌ ఆఫ్‌ అర్జున ఈ మూవీ వరల్డ్‌ని అద్భుతంగా ప్రజెంట్‌ చేసింది.

అగ్రహీరో నాగార్జున వాయిస్‌ ఓవర్‌తో కవితాత్మకంగా ఈ గ్లింప్స్‌ మొదలైంది. ప్రేమ స్వచ్ఛతలోని లోతును ఆయన మాటలు గొప్పగా ఆవిష్కరించాయి. ఆ వర్ణనలోనే అర్జున పరిచయం అవుతాడు. అర్జున మాట్లాడలేడు. కానీ నిశ్శబ్దం అతనిని బలహీనపరచదు.. అతని భావోద్వేగాలను తగ్గించదు అంటూ హీరోలోని ధైర్యాన్ని, బలాన్ని ఈ టీజర్‌ ద్వారా ఆవిష్కంచారు మేకర్స్‌. డెబ్యూ హీరోగా అనిష్‌ ఆట్టుకునే నటన కనబరిచాడు. ఫిట్‌గా, కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. కేవలం భావ వ్యక్తీకరణ, శారీరక భాషతోనే అతను ఈ కథను మోయడం ప్రశంసనీయం అని మేకర్స్‌ చెబుతున్నారు. గ్లింప్స్‌లో యాక్షన్‌ షాట్స్‌ కూడా ప్రశంసనీయంగా ఉన్నాయి. కథానాయిక అనస్వర రాజన్‌ చక్కని స్క్రీన్‌ ప్రెజన్స్‌తో ఫ్రేమ్‌లో తాజాదనాన్ని నింపింది. లీడ్‌ పెయిర్‌ కెమిస్ట్రీ కూడా సహజంగా అనిపిస్తుంది. ఈ చిత్రానికి కెమెరా: రాజా మహాదేవన్‌, సంగీతం: తమన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events