Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌కు షాక్‌ ఇచ్చిన జ్యూరీ

అమెరికా మాజీ అధ్యక్షుడు  డొనాల్డ్‌ ట్రంప్‌  కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. లైంగిక వేధింపుల కేసులో ట్రంప్‌కు జ్యూరీ గట్టి షాక్‌ ఇచ్చింది. తనను ట్రంప్‌ లైంగికంగా వేధించాడని ప్రముఖ రచయిత్రి జీన్‌ కారోల్‌  ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.  1990లో మాన్‌హట్టన్‌ అవెన్యూలోని బెర్గ్ డార్ఫ్ గుడ్ మాన్ డిపార్ట్ మెంట్ స్టోర్ డ్రెస్సింగ్ రూమ్‌లో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని జీన్ కారోల్ ఆరోపించింది.

 

2019లో ఓసారి తన గురించి అసభ్యకరంగా మాట్లాడి తన ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ పరువునష్టం దావా వేసింది. కారోల్‌ ఆరోపణలపై విచారణ జరిపిన న్యూయార్క్‌ జ్యూరీ,  ట్రంప్‌ను దోషిగా పేర్కొంది. అయితే, ట్రంప్‌పై చేసిన అత్యాచారం ఆరోపణల్లో మాత్రం వాస్తవం లేదని తేల్చింది. ఇతర ఆరోపణలు నిజమేనని తేల్చిన జ్యూరీ,  కారోల్‌కు పరిహారం కింద 5 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. జ్యూరీ తీర్పుతో మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన ట్రంప్‌కు షాక్‌ తగిలినట్లైంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events