పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచిన పీటీఐ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగిన పరిస్థితులు లేనందువల్ల ప్రతిపక్షంలోనే కూర్చుంటామని ప్రకటిం చింది. పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఓట్లు,సీట్లను తారుమారు చేసి ఉండకపోతే, తమకు 180 స్థానాలు లభించి ఉండేవన్నారు. పార్టీ ప్రధాని అభ్యర్థిగా ఉమర్ అయూబ్ ఖాన్‌ను పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అస్లాం ఇక్బాల్‌ను ఇంతకు ముందు ప్రకటించాం. తాజాగా ఈ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలిపింది.