Namaste NRI

అగ్రరాజ్యంలో ఎగరనున్న అతిపెద్ద త్రివర్ణ పతాకం

అమెరికాలోని భారతీయులు మన దేశ 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అతి పెద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగరేయనున్నారు. న్యూయార్క్‌ లోని ప్రఖ్యాత టైమ్‌ స్క్వేర్‌ దగ్గర ఈ పంద్రాగస్టు నాడు వాళ్లు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. న్యూయార్క్‌, న్యూజెర్సీ, కనెక్టికట్‌లలోని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ ఆ రోజు మొత్తం వేడుకలు జరపాలని నిర్ణయించింది. 24 గంటల పాటు టైమ్‌ స్క్వేర్‌ దగ్గర ఇండియా డే బిల్‌బోర్డ్‌ను ప్రదర్శించనున్నారు. ఇక ప్రఖ్యాత ఎంఫైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌ త్రివర్ణాల్లో మెరిసిపోనుంది. హడ్సన్‌ నదిలో క్రూజ్‌ షిప్‌పై ప్రత్యేక ఈవెంట్‌ ఏర్పాటు చేశారు. దీనికి అక్కడి ప్రభుత్వ పెద్దలు కూడా హాజరవుతున్నారు.

                ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ గతేడాది తొలిసారి టైమ్స్‌ స్క్వేర్‌లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిరచారు. ఇక నుంచి ఇక్కడ ప్రతి ఏటా ఈ వేడుక నిర్వహించాలని నిర్ణయించినట్లు అసోసియేషన్‌ చైర్మన్‌ అంకుర్‌ వైద్య తెలిపారు. ఈ ఏడాది టైమ్స్‌ స్క్వేర్‌లో అతిపెద్ద జెండాను ఎగరేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ జెండా 6 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు ఉండటంతో పాటు 25 అడుగుల ఎత్తున జెండా కర్రపై దర్జాగా ఎగరనుంది. ఈ అతిపెద్ద జెండాను న్యూయార్క్‌లోని కాన్సుల్‌ జనరల్‌ ఇండియా రణ్‌దీర్‌ జైశ్వాల్‌ ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకలో యంగెస్ట్‌ గ్రాండ్‌మాస్టర్‌, ఇండియన్‌`అమెరికన్‌ అభిమన్యు మిశ్రా పాల్గొననున్నాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events