ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సలార్. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నాడు. ఇందులో ప్రభాస్‌కు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తుంది. ఇప్పటికె రెండు షెడ్యూల్స్ జరుపుకుంది. కాగా శుత్రి హాసన్ పుట్టిన రోజు సందర్భంగా సలార్ చిత్రంలో శృతి హాసన్ క్యారెక్టర్ రివీల్ చేస్తూ దర్శకుడు ప్రశాంత్ నీల్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశాడు. శృతి హాసన్ ఇందులో ఆద్యగా కనిపించనుంది. తాజాగా విడుదలైన పోస్టర్లో శ్రుతి హాసన్ అటు వైపు తిరిగి ఎవర్నో దీర్ఘంగా చూస్తున్నట్లు ఉంది. కాగా ప్రభాస్ ఈ చిత్రంలో తండ్రీ, కొడుకులుగా డ్యూయల్ రోల్ లో కనిపించనున్నట్టు సమాచారం.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగపతి బాబు ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. రవి బసూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సలార్ ప్రొగ్రెస్ గురించి సమాచారాన్ని త్వరలో వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది.














