శరవణన్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ది లెజెండ్. ఊర్వశీ రొటేలా హీరోయిన్‌గా నటించారు. తెలుగులో నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలజ్ ఈవెంట్ శరవణన్ మాట్లాడుతే ఓ కామన్‌సేన్ ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నాడు? అన్నది లెజెండ్ కథ అన్నారు. శరవణన్‌గారు సక్సెస్‌పుల్ బిజినెస్‌మేన్. అయితే ఒక నటుడిగా ఆయన కమిట్‌మెంట్ ఎంత బాగుందనేది స్క్రీన్‌పై చూస్తారు అన్నారు దర్శకద్వయం జెడీ జెర్రీ. తెలుగు ప్రేక్షకులకు కొత్త కంటెంట్‌ను ఎప్పుడూ ఆదరిస్తారు. ది లెజెండ్ కథ కొత్తది. ఒక సక్సెస్‌పుల్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి అన్నారు ఎన్వీ ప్రసాద్. ఈ చిత్రానికి జేడీ` జెర్రీ ద్వయం తెరకెక్కించారు. ఈ నెల 28న తెలుగ, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.