శింబు కథానాయకుడిగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో తెరకెక్కించని చిత్రం వెందు తనిందదు కాడు. ఇది రెండు భాగాలుగా రూపొందుతోంది. ఈ సినిమా తెలుగులో ది లైఫ్ ఆఫ్ ముత్త పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నది. ఈ సందర్భంగా నిర్మాత స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ ట్రైలర్‌ని చూసి బాగా ఇంప్రెస్ అయ్యాను. శింబు గౌతమ్‌మీనన్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకుల తప్పకుండా నచ్చే కాన్సెప్ట్ ఇది. తెలుగులో భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. సిద్దీ ఇద్వానీ, రాధికా శరత్‌కుమార్ తదితరులు నటిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 15న విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సిద్దార్థ నూని, పాటలు: అనంత్‌శ్రీరాం, కృష్ణకాంత్, సంగీతం: ఏ.ఆర్.రెహమాన్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)