గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న విలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేను అమెరికాకు అప్పగించాలన్న నిర్ణయానికి బ్రిటన్ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధాలకు సంబంధించిన కీలక పాత్రాలను లీక్ చేసినట్లు వికీలిక్స్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఆస్ట్రేలియన్ పౌరుడైన 50 ఏళ్ల అసాంజేను అమెరికాకు అప్పగించే క్రమంలో ముఖ్యమైన ఫైలుపై బ్రిటన్ హోమ్ శాఖ మంత్రి ప్రీతి పటేల్ సంతకం చేశారు. అంతకుముందు అసాంజేను అమెరికాకు అప్పగించే వ్యవహారం కింద కోర్టుల నుంచి సుప్రీం కోర్టుల వరకు అనేక దశల్లో అప్పీలుకు వెళ్లింది. మేజిస్ట్రేట్ కోర్టుతో పాటు హైకోర్టు కూడా అసాంజే అప్పగింతపై ప్రభుత్వానికి అనుకూల తీర్పులు ఇచ్చామని బ్రిటన్ హోమ్ మంత్రిత్వ శాఖ కార్యాలయం అధికార ప్రతినిధి వెల్లడిరచారు. అయితే ఈ కోర్టు తీర్పులపై అప్పీల్ చేసుకునేందుకు అసాంజేకు 14రోజుల సమయం ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అసాంజే బృందం మరొక సారి అప్పీల్ చేసే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. అమెరికాకు అప్పగింత అంశంపై అసాంజే భార్య స్టెల్లా మాట్లాడుతూ తన భర్త ఎటువంటి తప్పు చేయలేదని, ఆయన ఎటువంటి నేరానికి పాల్పడలేదన్నారు. ఆయనో జర్నలిస్టు అని, పబ్లిషర్ అని, తన డ్యూటీ చేసినందుకు ఆయన్ను వేధిస్తున్నట్లు ఆమె ఆరోపించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)