Skip to main content

Namaste NRI

వి.వి. వినాయక్ చేతుల మీదుగా వెంకట్రామయ్య గారి తాలుకా చిత్రంలోని అడుకున్న దిక్కడే లిరికల్ సాంగ్ విడుదల

కుటుంబ బంధాలు, మానవ సంబంధాల విలువలను హృద్యంగా ఆవిష్కరిస్తూ రూపొందుతున్న వెంకట్రామయ్య గారి తాలుకా చిత్రం జులై 17న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ చిత్రం నుంచి ఆడుకున్న దిక్కడే అనే మూడో లిరికల్ సాంగ్‌ను స్టార్ దర్శకుడు వి.వి. వినాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. ఇప్పుడు విడుదల చేసిన ఆడుకున్న దిక్కడే పాట కూడా ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకునేలా ఉంటుందని, కథలోని ప్రధాన భావోద్వేగాలను ప్రతిబింబించే ఈ గీతం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ చిత్రంలో హీరోగా దినేష్ కుమార్ నటిస్తుండగా, దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. కోమలి క్రియేషన్స్ పతాకంపై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సతీష్ ఆవాల దర్శకత్వం వహిస్తున్నారు. కుటుంబ అనుబంధాలు, తల్లిదండ్రుల ప్రేమ, స్వచ్ఛమైన భావోద్వేగాలతో నిండిన ఈ సుందరమైన చిత్రం జులై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events