మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో అన్ని రకాల కోవిడ్ నిబంధనలను ఎత్తేస్తూ మహారాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ నిబంధనలు ఏప్రిల్ 2 నుంచే అమలులోకి వస్తాయని ప్రకటించారు. ఇక మాస్క్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే వ్యక్తిగత శ్రద్ధ వల్ల ఎవరైనా ధరిస్తే ఇబ్బంది వుండదని, తాము మాత్రం మాస్క్ కచ్చితమన్న నిబంధనను మాత్రం విధించమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వెల్లడిరచారు. రాష్ట్రంలో విధించిన కోవిడ్ నిబంధలన్నీ ఎత్తేస్తున్నాం. గుడి పాడ్వా (మహారాష్ట్ర నూతన సంవత్సరం) నుంచి అమలులో ఉంటాయని ప్రకటించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)