మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తున్నారు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో గాడ్‌ఫాదర్ ఒకటి. చిరంజీవి 153వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాజకీయాలు నేపథ్యంలో, యాక్షన్ ప్రధానంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన ప్రముఖ నటి నయనతార నటిస్తోంది. ఈ సినిమాలో నయనతార ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్లు తెలిసింది. చిత్ర యూనిట్ ఈ విషయాన్ని ప్రకటించింది. నయనతార పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం ఈ ప్రకటన చేసింది. నయన్ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ దర్శక నిర్మాత ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. మలయాళంలో విజయవంతమైన లూసీఫర్ కు రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో నయన్ సరసన ఓ యువ హీరో కనిపింంచనున్నట్లు ప్రచారం జరుగుతుంది. సైరా చిత్రంలో చిరంజీవి నయనతార కలిసి నటించి అందరినీ మెప్పించారు. ఇప్పుడు గాడ్ పాధర్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)