ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నారైలకు ఓ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. దీని ద్వారా ఎన్నారైలు రూ.5 లక్షలు గెలుచుకోవచ్చు. గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజల సందర్శనార్థం యమున నది ఒడ్డున ఓ ప్రత్యేక నిర్మాణాన్ని (గార్డెన్) నిర్మించాలని చూస్తోంది. తమ అంచనాలకు తగ్గట్టుగా ఈ నిర్మాణానికి కావాల్సిన పర్‌ఫెక్ట్ డిజైన్‌ను ఎవరైతే చేసి పెడతారో వారికి రూ.5 లక్షల బహుమతి ఇస్తామని ప్రకటించింది. ఈ డిజైన్ కాంపిటీషన్‌లో ఎన్నారైలు, ఆర్కిటెక్చర్ విద్యార్థులు కూడా పాల్గొనవచ్చని మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది.