పుష్ప చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు చక్కని స్పందన లభిస్తున్నది. దీంతో ట్రైలర్ చూడాలనే ఆతృత పెరిగింది. ఇందుకు ముహూర్తం ఖరారైంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తూ పుష్ప ట్రైలర్ను డిసెంబర్ 6న విడుదల చేయబోతన్నారు. పుష్ప సినిమాను రెండు భాగాలుగా తెరకక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మిస్తున్నారు. రష్మి నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రతినాయకుడిగా మళయాళనటుడు ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఈ సినిమాలో తొలి భాగం పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇందులో సమంత ప్రత్యేక గీతం చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్, సంగీతం దేవి శ్రీప్రసాద్, సీఈఓ చెర్రీ. సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సాహిత్యం: చంద్రబోస్,
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)