ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధాన్ని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ ఆడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆమోదించింది. హెమ్‌జెనిక్స్ అనే ఈ ఔషధం ఒక్క డోస్ ధర 3.5 మిలియన్ డాలర్లుగా ఉన్నది. మన కరెస్సీలో దాదాపు రూ.28.58 కోట్లు. ఇది హీమోఫిలియా బీ తో బాధపడుతున్న రోగులకు చికిత్స చేయడంలో వినియోగిస్తారు. హీమోఫీలియా బీ చాలా అరుదు. ఈ వ్యాధికి గురైన వ్యక్తి రక్తంలో ప్రోటీన్ లోపం ఉంటుంది. ఈ ప్రోటిన్ రక్తాన్ని గడ్డకట్టింది. ఈ ప్రోటీన్‌నే క్లాటింగ్ ఫ్యాక్టరీ అని కూడా అంటారు. హీమోఫీలియా వ్యాధితో బాధపడుతున్న వారు చిన్నపాటి గాయమైనా వారి గాయాలపై రక్తం గడ్డ కట్టదు. రక్తం కారుతూనే ఉంటుంది. ఎక్కువగా రక్తం పోవడంతో ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది. రక్తం గడ్డకట్టే కారకాలను ఉత్పత్తి చేయగల జన్యువును పంపిణీ చేయడం ద్వారా పనిచేస్తుంది. ఇక్కడ అది ఫాక్టర్ ప్రోటీన్ తయారీ పనిని ప్రారంభిస్తుంది. ఈ ఔషధాన్ని ఒక డోసు ద్వారా ఏడాది వ్యవధిలో 54 శాతం రక్తస్రావం సంఘటనల సంఖ్యను తగ్గిస్తుంది. ప్రస్తుతం ప్రాణాంతకమైన పరిస్థితిని నియంత్రించడానికి ఉపయోగిస్తున్నారు. లెక్సింగ్టన్, మసాచుసెట్స్‌లో ఈ జీన్ థెరపీని యానిక్యూర్ ఎన్‌వీ తయారు చేస్తుంది.