ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా భావిస్తున్న హెమ్‌జెనిక్స్ ఔషధానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. ఈ ఔషధం ఒక్కో డోసు ధర రూ.28 కోట్లు అని పెన్సిల్వేనియాకు చెందిన ఔషధ తయారీ సంస్థ సీఎస్‌ఎల్ బెహ్రింగ్ తెలిపింది. రక్తం గడ్డకట్టడానికి సంబంధించిన హిమోఫీలియా బీ అనే ఆరోగ్య సమస్యకు తొలి జన్యుపరమైన చికిత్స అందుబాటులోకి వచ్చింది. ఈ ఔషధంతో రక్తం కారడం/ గడ్డకట్టడానికి సంబంధించిన చికిత్సలు తక్కువ అవసరమవుతాయని, తద్వారా రోగులపై వ్యయం భారం తగ్గుతుందని కంపెనీ తెలిపింది. ప్రతి 40 వేల మందిలో ఒకరు హిమోఫీలియో బీతో బాధపడుతున్నట్టు ఎఫ్‌డీఏ పేర్కొన్నది.