డాన్బోస్లో పోరాటం నిస్సందేహంగా సైనిక చరిత్రలో అత్యంత ఖరీదైన యుద్ధంగా నిలిచిపోతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. యుద్ధం కారణంగా తాము డాన్బాస్ ప్రాంతంలో భారీ మూల్యం చెల్లిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం కోసం మూల్యం భయపెట్టేంత పెద్దదిగా ఉందన్నారు. మేం పిశాచంతోనే పోరాడుతున్నామన్నారు. మాకు ఆ ప్రదేశానికి విముక్తినివ్వడం మినహా మారో మార్గం లేదన్నారు. మేం ప్రతి ఒక్కదానిని అక్కడ పునర్ నిర్మించుకోవాలి. ఆక్రమణదారులు మొత్తం ధ్వంసం చేశారు అని అన్నారు.