Namaste NRI

ప్రపంచంలోనే శక్తివంతమైన రాకెట్ ప్రయోగం

అత్యంత శక్తివంతమైన రాకెట్‌ను రోదసీలోకి పంపాలని సుదీర్ఘకాలంగా యోచిస్తోన్న అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ ప్రణాళిక ఎట్టకేలకు అమలు కాబోతుంది. ఫిబ్రవరిలో రాకెట్‌ను అంతరిక్ష పరిశోధన సంస్థ ఆవిష్కరించనున్నది. అర్టెమిస్‌ మిషన్‌లో  భాగంగా ఈ రాకెట్‌ ద్వారా వ్యోమగాములను చంద్రుడిపైకి పంపనున్నది. ఆర్టెమిస్‌ 1 మానవ రహిత ప్రయోగం కాగా, ఆర్టెమిస్‌ 2, 3,4,5 దశల్లో వ్యోమగాములను జాబిల్లిపైకి పంపనున్నారు. ఈ మిషన్‌ ద్వారా తొలిసారి చంద్రమండలంపైకి మహిళా వ్యోమగామిని పంపేందుకు నాసా రంగం సిద్ధం చేస్తున్నది.  చంద్రుడిపై సుదీర్ఘకాలం పరిశోధనలు కొనసాగించేందుకు అవసరమైన నాసా రంగం సిద్ధం చేస్తున్నది. చంద్రుడిపై సుదీర్ఘకాలం పరిశోధనలు కొనసాగించేందుకు అవసరమైన ఉపకరణాలను కూడా పంపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు వెల్లడిరచింది. 

                        భవిష్యత్తులో అక్కడికి వెళ్లే వ్యోమగాములు వాటిని ఉపయోగించుకోవటానికి వీలుంటుందని వివరించింది. అక్కడ ఆర్టెమిస్‌ బేస్‌ క్యాంప్‌ను నిర్మిస్తామని, ఒక గేట్‌ వేను కూడా సిద్ధం చేస్తామని తెలిపింది. అత్యాధునిక మొబైల్‌ ఇల్లు, రోవర్‌ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడిరచింది.  భవిష్యత్తులో అంగార గ్రహంపైకి వెళ్లేందుకు ఇవి దోహదం చేస్తాయని పేర్కొన్నది. ఫిబ్రవరి 6న ఈ రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపనున్నట్లు సీఈఓ ఎలాన్‌ మస్క్‌ తెలిపారు. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ అపోలా లాంచింగ్‌ పేడ్‌ ద్వారా ఫాల్కన్‌ హెవీ రాకెట్‌ను ప్రయోగిస్తామని తెలియజేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events