ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, తెలుగు మహాసభల ప్రతినిధులు ఆయనకు స్వాగతం పలికారు.


మాతృ భాష మన మూలాలకు సంకేతమని , ఆంగ్లం అవసరమే కానీ మాతృభాష ను మరచిపోతె మనల్ని మనం కోల్పోయినట్లే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు గుంటూరులో నిర్వహిస్తున్న తెలుగు మహాసభల్లో సిఎం మాట్లాడారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన నందమూరి తారక రామారావు గారి పేరును ఈ వేదికకు పెట్టడం ఆనందంగా ఉందని అన్నారు. తెలుగు భాషకు ఘనమైన చరిత్ర వుందని వందలాది భాషలు వున్నా మన దేశంలో 6 భాషలకే ప్రాచీన హోదా వచ్చింది. ప్రపంచంలో దాదాపు 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతూ ఉన్నారు .ఈ తెలుగు మహాసభలకు 40 దేశాలనుండి ప్రతినిధులు వచ్చారని ఇలాంటి మహాసభలు తెలుగు బాషా పరిరక్షణకు ఉపయోగపడతామని అన్నారు. గిడుగు రామ్మూర్తిని తెలుగు జాతి ఎప్పటికీ మరువదని అన్నారు. నేను తెలుగు వాడిని నాది తెలుగుదేశం అని చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ తో తెలుగు భాషను సులువుగా కాపాడుకోవచ్చు .కొత్త తెలుగు యాప్ వచ్చాయి.పొట్టి శ్రీరాములు పేరుతో 1985లోనే తెలుగు యూనివర్సిటీని ఎన్టీఆర్ తీసుకొచ్చారు. ఇప్పుడు రాజమహేంద్రవరంలో తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు అన్నారు.
















