రమాకాంత్, అవంతిక, భానుశ్రీ ప్రధానపాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం సముద్రుడు. నగేశ్ నారదాసి దర్శకుడు. బధావత్ కిషన్ నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సంద ర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమా నికి దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, సముద్ర, నిర్మాతలు తుమ్మలపల్లి రామ సత్యనారా యణ, ముత్యా ల రాందాస్, కాసుల సుధీర్, జ్ఞానేశ్వర్, సోములు, శ్రీధర్‌రెడ్డి, కీర్తన హాజరై సినిమా ఘన విజయం సాధించాలని అభిలషించారు. మత్స్యకారుల జీవితాలను ప్రతిబింబించే సినిమా ఇదని, వారి జీవన పోరాటం , మనోవేదన నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని, త్వరలోనే సినిమా విడుదల చేయనున్నామని దర్శకుడు నగేశ్ నారదాసి తెలిపారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మొక్కవోని విశ్వాసంతో సినిమాను పూర్తి చేశామని హీరో చెప్పారు. సుమన్, శ్రవణ్, రామరాజు, రాజ్‌ప్రేమి, సమ్మెట గాంధీ, ప్రభావతి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్.