Skip to main content

Namaste NRI

మన డాక్టర్ బాబే మూవీ టీజర్ రిలీజ్

శ్రీస్కంద హీరోగా పరిచయమవుతున్న చిత్రం మన డాక్టర్‌ బాబే. చలపతి కుమార్‌ పువ్వల దర్శకుడు. స్కంద మూవీస్‌ పతాకంపై కృతాక్షి నిర్మిస్తున్నారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్‌.ఆదిత్య టీజర్‌ను లాంచ్‌ చేశారు. జంధ్యాల, ఈవీవీ తరహాలో ఆద్యంతం నవ్వించే చిత్రమిదని, ఓ సెన్సిటివ్‌ పాయింట్‌ను జాగ్రత్తగా డీల్‌ చేస్తూ ఈ సినిమా తీశారని హీరో శ్రీస్కంద తెలిపారు. వినోదంతో పాటు హృదయాన్ని కదిలించే భావోద్వేగాలుంటాయని, ప్రేక్షకులు కన్నీటి చెమ్మతో థియేటర్ల నుంచి బయటకు వస్తారని దర్శకుడు చలపతి కుమార్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News