Namaste NRI

రాజాసాబ్ నుంచి నాచే నాచే సాంగ్ ప్రోమో రిలీజ్

అగ్రకథానాయకుడు ప్రభాస్‌, దర్శకుడు మారుతి కాంబోలో రూపొందుతున్న చిత్రం రాజా సాబ్‌. టీజీ విశ్వప్రసాద్‌, కృతిప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధికుమార్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబయిలో జరిగిన ఈవెంట్‌లో సినిమాలోని నాచె నాచె అనే పాటను విడుదల చేశారు. ఈ వేడుకలో చిత్ర కథానాయికలు రిద్దికుమార్‌, మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, బాలీవుడ్‌ నటుడు బొమన్‌ ఇరానీ, చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా కోసం 36వేల స్కేర్‌ ఫీట్‌తో ఇండియన్‌ సినిమాలో ఇప్పటి దాక లేనటువంటి బిగ్గెస్ట్‌ ఇండోర్‌ సెట్‌ వేశామని, వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ అత్యున్న ప్రమాణాలతో అబ్బురపరుస్తుందని, ప్రభాస్‌ వంటి స్టార్‌తో అన్‌కాంప్రమైజ్డ్‌గా ఈ చిత్రాన్ని నిర్మించామని నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ తెలిపారు.

ఇప్పటికే తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించానని, అయితే రాజాసాబ్‌ మరపురాని అనుభూతినిచ్చిందని, ప్రభాస్‌ను అందరూ ప్రేమగా డార్లింగ్‌ అని పిలుస్తారని, తన దృష్టిలో డార్లింగ్‌ అనే మాటకు నిజమైన అర్థం ప్రభాస్‌ అని సీనియర్‌ నటి జరీనా వహాబ్‌ అన్నారు. ప్రభాస్‌ వంటి మంచి మనసున్న వ్యక్తి హీరో కాబట్టి కథ గురించి తెలుసుకోకుండానే సినిమా అంగీకరించానని బొమన్‌ ఇరానీ చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events