తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ పేరు పెట్టడం హర్షణీయమని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చట్ట సభలకు దిశానిర్దేశం చేసిన మహనీయుడు అంబేడ్కర్ అని వ్యాఖ్యానించారు. మహానీయుని పేరు తెలంగాణ సచివాలయానికి నామకరణం చేయడం గొప్ప విషయం అన్నారు. కేసీఆర్‌కు మహనీయులతో పాటూ, దళితజాతి పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమని చెప్పారు. పేదలు, బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన జరిగే దేవాలయం లాంటి శాసనసభకు అంబేడ్కర్ పేరు పెట్టడం అన్ని విధాలా సముచితమని తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)