అమెరికాలోని అలబామా రాష్ట్రంలో బర్త్‌డే పార్టీలో కాల్పుల మోత మోగింది. కొందరు దుండుగులు జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. పలువురికి గాయాలయ్యాయని తెలుస్తున్నది. అలబామాలోని డేడ్‌విల్లేలో గల ఒక డ్యాన్స్ స్టూడియిలో కొందరు యువతులు, యువకులు బర్త్‌డే పార్టీ వేడుకలు చేసుకున్నారు. శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో బర్త్‌డే పార్టీ జరుగుతున్న స్టూడియో వద్దకు వచ్చిన కొందరు యువకులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడినట్లు తెలుస్తున్నది.
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/638bff07-efd2-4cc9-8546-98039833db3c-33.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/45af6911-9449-466d-a7e1-ba146800284b-37.jpg)
ఈ సమాచారం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మరణించే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ కాల్పులకు దారి తీసిన కారణాలపై పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.ఈ కాల్పుల ఘటనలో అసలేం జరిగిందో ఇప్పుడే ఏమీ చెప్పలేమని అలబామా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చెప్పారు. ఈ ఘటన అనుమానితులను కస్టడీలోకి తీసుకున్న విషయంపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. పలు విభాగాల సాయంతో ఈ కేసు పూర్తి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-89.jpg)