అమెరికాలో ఓ సంస్థ యజమాని తన కంపెనీని కార్మికులకు రాసిచ్చాడు. ఆయన పేరు బాబ్ మూర్. బాబ్స్ రెడ్‌మిల్ పేరిట ఉన్న ఇతని కంపెనీలో ఇప్పుడు 700 మంది ఉద్యోగులున్నారు. దీని యజమాని మిలియనీర్ అయిన మూర్ తన చిరకాల వాంఛను ఈ విధంగా నెరవేర్చుకున్నారు. ఇటీవలే 94 ఏండ్ల వయసులో మూర్ మరణించారు. అమెరికాకు చెందిన మూర్ ఈ సంస్థను 1978లో ఏర్పాటు చేశారు. చిరుధాన్యాలతో నాణ్యమైన ఉత్పత్తులను ఈ సంస్థ తయారు చేసి విక్రయిస్తుంది. సంస్థ అనతికాలంలోనే అభివృద్ధి చెందడానికి ఉద్యోగు లే కారణమని మూర్ ఎప్పుడూ అభిప్రాయపడేవాడు. అందుకు తన కంపెనీలో వారికి యాజమాన్యం ఇవ్వాలనుకున్నాడు.