Skip to main content

Namaste NRI

కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌!

కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో 26వ నెసెట్‌(ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌)లోని కీలక పదవులకు అభ్యర్థుల విషయంలో తన తోటి ప్రతిపక్ష నాయకులైన నఫ్తాలీ బెన్నెట్‌, యైర్‌ గోలన్‌, అవిగ్డోగ్‌ లిబర్‌మాన్‌, యైర్‌ లాపిడ్‌లతో ఒక ఒప్పందానికి వచ్చినట్టు మాజీ సైనిక అధిపతి, బెంజమిన్‌ నెత్యాహుకు బలమైన ప్రత్యర్థి గాడి ఐసెన్‌కోట్‌ ప్రకటించారు. ఈ ఒప్పందంలో భాగంగా మాజీ మంత్రి మతాన్‌ కహానాను నెసెట్‌ స్పీకర్‌ అభ్యర్థిగా నియమించారు. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మొదటి అవకాశాన్ని విపక్ష నాయకుడు ఐసెన్‌కోట్‌కు ఇస్తున్నట్టు ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఐజాక్‌ హెర్జోగ్‌ ప్రకటించారు.

ఎన్నికల్లో ఐసెన్‌కోట్‌ కూటమికి గానీ, నెతన్యాహు కూటమికి గానీ పార్లమెంట్‌లో స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఐసెన్‌కోట్‌కు ఆరు వారాల సమయం లభించింది. ఒప్పందం ప్రకారం నెసెట్‌లోని కీలక పదవులకు అభ్యర్థులపై నాయకులు ఏకాభిప్రాయానికి వచ్చారని ఐసెన్‌కోట్‌ పేర్కొన్నారు. కమిటీల కూర్పుపై ఈ వారంలో హౌస్‌ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events