Namaste NRI

అమెరికాలో కళాత్మక ప్రతిభకు మార్గం పుస్తకావిష్కరణ

తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం-  యూఎస్‌ఏ (టీడీఎఫ్‌) ఆధ్వర్యంలో ఎంవీ రమణారెడ్డి జీవిత విశేషాలపై కోలీ ముఖర్జీ ఘోష్‌ రచించిన ఎంవీ రమణారెడ్డి, పాత్‌ టూ ఆర్టిస్టిక్‌ బ్రిలియన్స్‌-ఏ జర్నీ (కళాత్మక ప్రతిభకు మార్గం- ఒక ప్రయాణం) పుస్తకాన్ని అమెరికాలోని వాషింగ్టన్  డీసీలో ఆవిష్కరించారు. రమణారెడ్డి స్మారక శిల్పాల రూపకల్పనకు సుపరిచితుడు. ప్రపంచంలోనే అతిపెద్ద అతుకులు లేని (సీమ్‌ లెస్‌) స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ నిర్మాణాల్లో ఒకటైన అమరవీరుల స్మారకానికి ఎంవీరెడ్డి రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమంలో యూఎస్‌ఏ టీడీఎఫ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ దివేశ్‌ అనిరెడ్డి, చైర్మన్‌ వెంకట్‌ మారెమ్‌, మాజీ అధ్యక్షురాలు కవిత చల్లా, టీడీఎఫ్‌ న్యూజెర్సీకి చెందిన మురళి చింతలపాణి పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News