Namaste NRI

ఠాగూర్ ‌ మల్లినేని ఆధ్వర్యంలో పెనమలూరు తానా కార్యక్రమం సక్సెస్‌

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్‌ తరపున తానా మీడియా కో ఆర్డినేటర్‌ ఠాగూర్ ‌ మల్లినేని పెనమలూరులో నిర్వహించిన తానా చైతన్యస్రవంతి కార్యక్రమం విజయవంతమైంది. జడ్‌ పి హైస్కూల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు తానా నాయకులతోపాటు, ఏరియా ప్రముఖులు, జడ్‌పి హైస్కూల్‌ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి చేయూత కార్యక్రమం కింద పేద విద్యార్థులకు దాదాపు లక్ష రూపాయల విలువ చేసే స్కాలర్‌ షిప్‌లను పంపిణీ చేశారు. రైతు కోసం కార్యక్రమం కింద పేద రైతులకు పవర్‌ స్ప్రేయర్లు, రైతు రక్షణ పరికరాలను అందజేశారు. ఆదరణ కార్యక్రమం కింద మహిళలకు కుట్టుమిషన్లను, వికలాంగులకు ట్రై సైకిళ్ళను పంపిణీ చేశారు. క్యాన్సర్‌ పరీక్ష కేంద్రం ఏర్పాటుతోపాటు ఇఎన్‌టి, టాప్ స్టార్ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్యశిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి అవసరమైన వారికి మందులు, పరీక్షలను చేశారు. జడ్‌పి హైస్కూల్‌కు కుట్టుమిషన్లను దివ్యంగులకు ట్రై సైకిల్స్ అందజేశారు. న్యూయార్క్ ఎన్నారై శ్రీనివాస నాదెళ్ళ పెనమలూరు జడ్‌ పి హైస్కూల్ పేద విద్యార్థి కి పది వేల రూపాయిలు సహాయం చేసారు.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి మాట్లాడుతూ, జడ్‌పి హైస్కూల్‌లో తరగతులను, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచడంతోపాటు కార్పొరేట్‌ స్కూల్‌ కన్నా మిన్నగా ఈ హైస్కూల్‌ విద్యార్థులు పరిశుభ్రతకు పెద్ద పీట వేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాను కూడా ఇలాంటి హైస్కూల్‌లోనే చదువుకుని నేడు అమెరికాలో ఉన్నతోద్యోగం చేస్తున్నానని, ఈ ప్రాంతానికి చెందిన ఠాగూర్ ‌ మల్లినేని కూడా ఇక్కడ నుంచి చదువుకుని అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నారని అంటూ, మీరు కూడా కష్టపడి చదివితే బాగా అభివృద్ధి చెందుతారని చ

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events