రామ్ అగ్నివేష్ హీరోగా డా.అశ్విని నాయకుడు నిర్మించిన చిత్రం ఇక్షు. వివి ఋషిక దర్శకత్వం వహించారు. వికాస్ బాడిస సర్వపరిచారు. నవీన్ తొగిటి సిమాటోగ్రఫీ అందించారు. తమిళం, తెలుగు సహా ఐదు భాషల్లో సిద్ధమవుతున్న ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. దర్శకురాలు యథార్థ సంఘటనను ప్రధానంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదొక ఫ్యామిలీ థ్రిల్లర్. ఏకకాలంలో ఐదుభాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం ఆనందంగా వుంది అన్నారు. చెన్నైలో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాణాల కోసం పోరాడుతున్న యువతను ధైర్యంగా కాపాడిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ శ్రీమతి రాజేశ్వరి తమిళ సినీ ప్రముఖుల సమక్షంలో టీజర్‌ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత కె.రాజన్, దర్శకుడు కవైపులి జి.శేఖరన్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు విజయమురళి, గిల్డ్ నాయకుడు జాగ్వార్ గోల్డ్, నటుడు నట్టి సహాసినీ ప్రముఖులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)