వచ్చే ఏడాది రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల అభ్యర్థిగా తాను బరిలో దిగనున్నట్లు వస్తున్న వార్తలను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఖండిరచారు. తాను ఆ పదవి రేసులో లేనని స్పష్టం చేశారు. పార్లమెంటులో ఎన్డీయేకు విస్పష్ట మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఆ కూటమికి పోటీగా బరిలో దిగే అభ్యర్థికి ఎలాంటి ఫలితం వస్తుందన్నది ముందే ఊహించుకోవచ్చని పవార్ అన్నట్లు ఎన్సీపీ వర్గాలు తెలిపారు. శరద్ పవార్‌తో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇటీవల రెండుసార్లు భేటీ అయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకలతోనూ ఆయన సమావేశమయ్యారు. దీంతో పవార్‌ను రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఊహగానాలు వెలువడ్డాయి.