
అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. డెమోక్రాటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ పేరు ఖరారైంది. మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా ట్రంప్‌ను అధ్యక్ష అభ్యర్థిగా ఆమోదించారు.
