ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా నటించిన చిత్రం గీత సాక్షిగా. ఆంథోని మట్టిపల్లి దర్శకుడు. చేతన్‌రాజ్ నిర్మాత. ఇటీవల విడుదలైన మూవీ ఫస్ట్ లుక్ నుంచి సాంగ్స్ వరకూ సినిమా పై మంచి వైబ్ క్రియేట్ అయింది. ఈ సినిమా లో శ్రీకాంత్ అయ్యంగార్, రూపేష్ శెట్టి, చరిష్మా, భరణి శంకర్, జయలలిత తదితరులు నటించారు. దర్శకుడు మాట్లాడుతూ నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఇన్‌టెన్స్ ఎమోషనల్ డ్రామా ఇది. ప్రతి సన్నివేశం ఎంతో సహజంగా నూతనత్వంతో నిండి వుంటుంది. కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఆదరించే ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది అన్నారు. ఈ సినిమాలో చరిష్మా కీ రోల్ పోషించింది. ఆమె చుట్టూనే ఈ కథాంశం తిరుగుతుంది. ఈ సినిమాను మార్చి 22న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీలోను ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.