శ్రీవిష్ణు, కథానాయకుడిగా తేజ మర్ని తెరకెక్కించిన చిత్రం అర్జున ఫల్గుణ. శ్రీవిష్ణు శైలికి తగ్గ వైవిధ్యభరితమైన కథాంశంతో ఈ సినిమా రూపొందించాం. పసందైన వినోదాన్ని పంచిస్తుంది. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. త్వరలో మిగిలిన పాటలు, ట్రైలర్ విడుదల చేస్తాం అని దర్శక నిర్మాతలు తెలియజేశారు. విభిన్నమైన చిత్రాలతో హీరోగా తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీ విష్ణు ఈ చిత్రంలో మాస్ అవతారంలో కనిపిచబోతున్నారు. ఇందులో శ్రీవిష్ణు తన ఫ్రెండ్స్‌తో కలిసి ఓ గోనె సంచిలోకి తొంగి చూస్తున్నారు. ఇది సొరంగ మార్గాన్ని తలిపిస్తున్నట్లుగా ఉంది. ఈ సినిమాలో నరేష్, శివాజీ రాజా, దేవి ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ స్వరాలందించారు. జగదీష్ చీకటి ఛాయాగ్రహకుడిగా వ్యవహరించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. అమృతా అయ్యర్ కథానాయిక. ఈ సినిమా నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
