Namaste NRI

రెండోదశ యుద్ధం మొదలైంది.. కడదాక పోరాడతాం

రష్యాతో యుద్ధం రెండో దశకు చేరుకుంది. బలమైన శత్రువును మా మెరికల్లాంటి కొద్దిపాటి సైనికులు ఎదురొడ్డుతున్నారు. ప్రాణాలు తెగించి పోరాడుతున్నారు. రష్యా హెచ్చరికలు లెక్క చేయం ఎవరూ లొంగిపోరు. మా మాతృభూమి రక్షణకు కడదాకా పోరాడుతాం అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు.  మేరియుపోల్‌లో పూర్తిస్థాయి పట్టు సాధించిన రష్యా తూర్పు, దక్షిణ ప్రాంతాల్లోని అనేక నగరాలపై దాడులు ముమ్మరం చేసింది. పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. లెవివ్‌ నగరంపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో సురక్షిత,  లేదా ప్రమాదకరమైన ప్రాంతాలంటూ ప్రత్యేకంగా ఏమీ లేని పరిస్థితి నెలకొందని  ఆవేదన వ్యక్తం చేశారు. ఖార్ఖీవ్‌, జపోరిరీaయా, డానెట్స్క్‌, ద్నిప్రొపెట్రోవస్క్‌, పోర్ట్‌ సిటీ మికోలయిన్‌లపై రష్యా విరుచుకుపడుతోంది. రష్యాపై ఎదురు దాడులు ఉదృతం చేస్తామని, డానెట్స్క్‌, లుషాంక్‌, ఖార్కీవ్‌ ప్రాంతాల్లో జొరబడేందుకు పెద్దఎత్తున రష్యా బలగాలు ప్రయత్నించామని, కానీ ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా వదులుకోబోమని, తమ దళాలు శత్రువు ప్రయత్నాలను తిప్పికొట్టాయని వెల్లడిరచారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events