అమెరికా సేనేట్ లో మళ్లీ రిపబ్లికన్ పార్టీ ఆధిక్యాన్ని సాధించింది. పెద్దల సభ సేనేట్‌లో ట్రంప్ పార్టీ దూసుకెళ్తున్నది. 50 సీట్ల మార్క్‌ను ఆ పార్టీ దాటేసింది. ఇంకా అనేక చోట్ల కౌంటింగ్ జరుగుతున్నది. తాజా సమాచారం ప్రకారం డెమోక్రాట్లు తమ మెజారిటీని కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు. రిపబ్లికన్ల స్థానాల్లో విక్టరీ కోసం డెమోక్రాట్లు తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ సేనేట్ ఈసారి రిపబ్లికన్ వశం అయ్యే ఛాన్సులు స్పష్టంగా ఉన్నాయి.
2021 నుంచి సేనేట్‌లో రిపబ్లికన్ పార్టీ ఆధిక్యాన్ని కోల్పోయింది. ఇక సేనేట్ నేతగా కొత్త లీడర్‌ను ఎన్నుకోనున్నారు. డెమోక్రాట్లు 40 స్థానాల్లో, రిపబ్లికన్లు 51 స్థానాల్లో విక్టరీ సాధించారు. ఒక స్థానం ఇండిపెండెంట్‌కు వెళ్లింది. మరో 8 స్థానాల ఫలితాలు వెలుబడాల్సి ఉన్నది. వెస్ట్ వర్జీనియా, ఓహియాతో పాటు నెబ్రస్కాలో రిపబ్లికన్ పార్టీ విజయం సాధించింది. దీంతో ఆయన పార్టీకి సేనేట్‌లో మెజారిటీ కన్ఫర్మ్ అయ్యింది.