రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుటుంబీకులందరిన్నీ అత్యంత సురక్షితమైన బంకర్లలోకి పంపినట్లు తెలుస్తోంది. అణ్వాయుధాలతో ఈ బంకర్లపై దాడులు చేసినా కుటుంబీకులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లనంత పటిష్టమైన అండర్‌గ్రౌండ్ బంకర్లలో పంపించారని సమాచారం. ఈ సీక్రెట్ బంకర్లు నైబీరియాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ యుద్ధమంటూ వస్తే వారి కుటుంబీకులకు ఎలాంటి ప్రమాదం జరగకూడదన్న ఉద్దేశ్యంతోనే పుతిన్ ఈ సీక్రెట్ బంకర్లను ఎంచుకున్నారు. అయితే నైబీరియాలోని ఏ ప్రాంతంలో వీరిని దాచారన్నది పుతిన్ అత్యంత గోప్యంగా ఉంచారు. నైబీరియాలోని అల్తాయి పర్వత సానువుల్లో ఈ బంకర్లు ఉన్నట్లు కొందరు అంచనా వేస్తున్నారు. ఈ బంకర్లు అత్యంత విలాసవంతమైన, అత్యాధునిక సాంకేతికతతో కూడిన బంకర్లని సమాచారం. అణ్వాయుధాలతో దాడులు చేసినా ఈ బంకర్లకు వీసమెత్తు నష్టం కూడా వాటిల్లదట. పుతిన్ కేవలం వారి కుటుంబీలకు కోసమే ఈ బంకర్లను తయారు చేయిచినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు ప్రపంచ దేశాల నుంచి మద్దతు పెరగడం, రష్యాతో ఉక్రెయిన్ ప్రతిఘటిస్తున్న నేపపథ్యంలో పుతీన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రాధాన్యం ఏర్పడిరది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)