నారా రోహిత్ హీరోగా చేసిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్‌తో వస్తున్నాడు. ఇటీవలే రిలీజైన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌కు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. టీవీ-5 సీనియర్ జర్నలిస్ట్ మూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. స్క్రిప్ట్‌లోని 60వ సీన్‌తో సినిమాను స్టార్ట్ చేశారు. రానున్న ఎన్నికల దృష్ట్యా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఇన్‌సైడ్ టాక్. అంతేకాకుండా వీలైనంత త్వరగా షూటింగ్‌ను కంప్లీట్ చేసి రిపబ్లిక్ డే సందర్భంగా ఒక రోజు ముందుగా జనవరి 25న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
