వేదిక లీడ్రోల్లో నటిస్తున్న థ్రిల్లర్ చిత్రం ఫియర్. హరిత గోగినేని దర్శకత్వంలో ఏఆర్ అభి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. అరవింద్‌కృష్ణ, జె.పి, పవిత్రలోకేశ్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ ప్రారంభించుకుని సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేశామని, డైరెక్టర్‌గా తొలి సినిమా అయినా క్లారిటీగా హరిత ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, వేదికతోపాటు మిగతా ఆర్టీస్టులందరూ సహకరించడం వల్లే ఇంత త్వరగా సినిమా పూర్తి చేయగలిగామని, నిర్మాణానంతర కార్యక్రమా లు కూడా త్వరలోనే పూర్తి చేసి థియేటర్లలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.ఈ చిత్రానికి కెమెరా: ఐ ఆండ్రూ, సంగీతం: అనూప్ రూబెన్స్, సహనిర్మాతలు: సుజాతరెడ్డి, సామ సురేందర్‌రెడ్డి, నిర్మాణం: దత్తాత్రేయ మీడియా.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)