Namaste NRI

ఆ దేశంలో పరిస్థితి ఉద్రిక్తం .. భారత పౌరులకు ఎంబసీ అడ్వయిజరీ!

ఇరాన్‌ పై అమెరికా దాడులు చేయవచ్చునన్న అంచనాలు, విద్యార్థుల ఆందోళనలతో ఆ దేశంలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌లోని భారత పౌరులకు అక్కడి మన ఎంబసీ తాజాగా అడ్వయిజరీ జారీచేసింది. తక్షణమే ఆ దేశాన్ని వీడాలని సూచించింది.

ఇరాన్‌లో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా జనవరి 5న భారత ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు కొనసాగింపుగా మళ్లీ అడ్వయిరీ జారీ చేస్తున్నాం. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయులు (విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు) కమర్షియల్ విమానాలతో సహా అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల ద్వారా ఇరాన్‌ను తక్షణమే విడిచిపెట్టి వెళ్లండి. భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించండి. ఆందోళనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండండి. ఇరాన్‌లోని భారత ఎంబసీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉండండి అని ఇరాన్‌లోని భారత ఎంబసీ తన అడ్వయిజరీలో పేర్కొన్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events