కార్తి కథానాయకుడిగా తమిళంలో రూపొందిన వా వాతియార్ సినిమా తెలుగులో అన్నగారు వస్తారు పేరుతో ఈ నెల 12న విడుదల కానుంది. కృతిశెట్టి కథానాయిక. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ఓ పాటను మేకర్స్ విడుదల చేశారు. అలాపిక్కే ఉమ్మక్ అంటూ సాగే ఈ పాటను రాకేందుమౌళి రాయగా, సంతోష్ నారాయణన్ స్వరపరచి, ఆలపించారు. ఇక ఈ పాట సాహిత్యం విషయానికొస్తే.. వలయ అహ్ కలయ.. గోలయ్య.. జై బాలయ్య.. కలలే వలరా గురువా నా మాటే వినరా అంటూ చిత్రమైన లిరిక్స్‌తో పాట సాగింది.

కార్తి ఎనర్జిటిక్ స్టెప్స్ ఈ పాటకు హైలైట్. ఇప్పటికే విడుదలైన అన్నగారు వస్తారు సాంగ్‌కి మంచి స్పందన వస్తున్నదని, ఈ పాట కూడా తప్పకుండా అందరికీ నచ్చుతుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనంద్‌రాజ్, రాజ్‌కిరణ్, శిల్పా మంజునాథ్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – జార్జ్ సి.విలియమ్స్, ఎడిటింగ్ – వెట్రే కష్ణన్, మ్యూజిక్ – సంతోష్ నారాయణన్, నిర్మాత – కె. ఇ. జ్ఞానవేల్ రాజా, రచన, దర్శకత్వం – నలన్ కుమారస్వామి.
















